: కాశ్మీర్ లో కనెక్టవిటీని పెంచుతాం: మోడీ
కార్గిల్ పర్యటనలో చూటక్ హైడ్రోఎలక్ట్రికల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్ పై నిప్పులు చెరిగారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తాము ఇకపై కఠినంగా అణచివేస్తామని మోడీ పేర్కొన్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో తాను ఇక్కడకు వచ్చానని మోడీ గుర్తుచేసుకున్నారు. తాను గతంలో ఇక్కడకు వచ్చినప్పడు తుపాకీ చప్పుళ్లు వినపడ్డాయని... ప్రస్తుతం మళ్లీ చప్పట్లు వినబడుతున్నాయని కార్గిల్ ప్రజల కరతాళధ్వనుల మధ్య ఆయన వ్యాఖ్యానించారు. మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించి కాశ్మీరులో కనెక్టవిటీని పెంచుతామని మోడీ తెలిపారు.