: ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి నాట్స్ రూ.52 లక్షల విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) రూ.52 లక్షల విరాళాన్ని ఇచ్చింది. ఈ మేరకు లేక్ వ్యూ అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన నాట్స్ అధ్యక్షుడు దేసు గంగాధర్, ఉపాధ్యక్షుడు రవి అచంట పలువురు విరాళం చెక్కును అందజేశారు. ఇదే సమయంలో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో వచ్చే ఏడాది జులైలో నిర్వహించే నాట్స్ ఉత్సవాలకు రావాలని బాబును ఆహ్వానించారు. మరోవైపు ఏపీ రాజధాని నిర్మాణం కోసం చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కోటి రూపాయల విరాళాన్ని అందించింది.