: కరెన్సీపై గాంధీని తప్ప మరెవరినీ ముద్రించలేం!: ఆర్బీఐ గవర్నర్


'భారతరత్న' ఎవరికి దక్కేనన్న ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎందరో మహానుభావులున్నా, కరెన్సీ నోట్లపై ముద్రించేందుకు మహాత్ముడే సరైన వ్యక్తని అభిప్రాయపడ్డారు. హోమీబాబా, రవీంద్రనాథ్ టాగోర్ ల ముఖచిత్రాలను కరెన్సీ నోట్లపై ముద్రించవచ్చు కదా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గొప్పవాళ్ళు చాలామందే ఉన్నారని, వారందరికంటే గాంధీ ఓ మెట్టుపైనే ఉంటారని తెలిపారు. గాంధీని కాకుండా మరెవరినైనా నోట్లపై ముద్రిస్తే వివాదాస్పదం అయ్యే అవకాశాలున్నాయని రాజన్ పేర్కొన్నారు. ఇటీవలే ఓ క్రీడాకారుడికి 'భారతరత్న' ఇవ్వడంపై ఎంత చర్చ నడిచిందో తెలిసిందే కదా! అని ఈ సందర్భంగా ఉదహరించారు. ముంబయిలో జరిగిన లలిత్ దోషి స్మారక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

  • Loading...

More Telugu News