: తెలంగాణ రాష్ట్రంలో సర్వేపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం


ఈ నెల 19న తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న సర్వేపై కాంగ్రెస్ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన సీఎం కేసీఆర్ కు ఇప్పుడు వారు దొంగల్లా కనబడుతున్నారా? అని ప్రశ్నించారు. సర్వే రోజున పనులన్నీ మానుకుని మరీ ఉండాలని చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సర్వే రోజున కుటుంబంలోని అందరూ ఇంట్లోనే ఉండాలని చెప్పడం... వంటగది, టీవీలను తనిఖీ చేస్తామనడం సరైంది కాదని జీవన్ రెడ్డి సూచించారు. మైనార్టీల ఇళ్లలోకి వెళ్లి తనిఖీ చేయడం ఇబ్బందిగా ఉంటుందన్న విషయం మరచిపోయారా? అని అడిగారు. దినసరి కూలీలు పని చేస్తేనే వారి కుటుంబం గడుస్తుందని అలాంటిది అందరూ ఇంటివద్దే ఎలా ఉంటారన్నారు.

  • Loading...

More Telugu News