: త్వరలో బీజేపీ ఆఫీస్ బేరర్ల కొత్త సభ్యుల ప్రకటన
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తన నియామకాన్ని ధృవీకరించిన వెంటనే అమిత్ షా పార్టీ ఆఫీస్ బేరర్లను మార్చేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో కొత్త ఆఫీస్ బేరర్లను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పదిమంది కొత్త ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఉంటారంటున్నారు. ఇందులో షాకు నమ్మకస్తులైన జేపీ నద్దా, రాం మాధవ్, భూపేందర్ యాదవ్, కెప్టెన్ అభిమన్యు, వరుణ్ గాంధీ, రాజీవ్ ప్రతాప్ రూఢీ వంటి ప్రధాన నేతలు ఈ జట్టులో ఉండవచ్చని వినికిడి.