: సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం... రాయితీలు ఇస్తాం: మంత్రి కేటీఆర్
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని టీఎస్ మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో తెలుగు సినీ పరిశ్రమ అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పరిశ్రమకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తామని... రెండు వేల ఎకరాల్లో అంతర్జాతీయ ఫిలిం సిటీని నిర్మిస్తామని చెప్పారు. తెలుగు ఫిలిం సిటీని మరింత విస్తరిస్తామని... సినీ రంగానికి రాయితీలను ఇస్తామని అన్నారు.