: హమ్మయ్య... గవాస్కర్ కు దెబ్బలు తగల్లేదు!


భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఓ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారట. ఆదివారం నాడు మాంచెస్టర్ నుండి లండన్ వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో కార్లో గవాస్కర్ తో పాటు ఆయన మిత్రుడు చంద్రేష్ పటేల్, క్రికెట్ వ్యాఖ్యాత మార్క్ నికోలస్ కూడా ఉన్నారు. సన్నీ తదితరులు వెనుక సీట్లో కూర్చుని ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో వారు ప్రయాణిస్తున్న జాగ్వార్ కారు దెబ్బతిన్నది. అదృష్టవశాత్తూ సన్నీ సహా ఎవరికీ గాయాలు కాలేదు. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ "మై గాడ్! మమ్మల్ని దేవుడే రక్షించాడు. ఆ సమయంలో వర్షం కూడా పడుతోంది. పైగా, డ్రైవర్ కారును వేగంగా నడుపుతున్నాడు. అంత ప్రమాదం జరిగినా ఎవరూ గాయపడలేదు. ఏమైనా, అది చాలా భయానకం!" అని తెలిపారు. కాగా, ప్రమాదం తర్వాత వారా కారు వదిలేసి ఈస్ట్ మిడ్ ల్యాండ్ రైల్వే స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్ళి, అక్కడో ట్రైన్ పట్టుకుని లండన్ చేరుకున్నారట. ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కు గవాస్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News