: ఈసారి ఖైరతాబాద్ గణనాథునికి 5 టన్నుల మహా లడ్డు!
రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగానూ ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ గణనాథుడికి ఈ ఏడాది 5 టన్నుల లడ్డు నైవేద్యంగా రానుంది. 2010లో 600 కిలోల లడ్డును ఖైరతాబాద్ వినాయకుడికి నైవేద్యంగా సమర్పించిన తాపేశ్వరం సురుచి ఫుడ్స్, ఈ ఏడాది ఏకంగా 5 టన్నుల లడ్డును అందజేసేందుకు రంగంలోకి దిగింది. ఈ భారీ లడ్డు తయారీకి 1,450 కిలోల శనగ పప్పు, 1,000 కిలోల నెయ్యి, 2,250 కిలోల పంచదార, 90 కిలోల బాదం పప్పు, 30 కిలోల యాలకులు, 10 కిలోల పచ్చ కర్పూరం వినియోగిస్తున్నట్లు సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు తెలిపారు. 7.5 అడుగుల ఎత్తుతో, 6.5 అడుగుల వ్యాసంతో తయారు చేస్తున్న ఈ లడ్డు, ఆరు నెలల పాటు నిల్వ ఉండేలా తయారు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.