: ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు జవాన్లకు గాయాలు


శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పాంపోర్ వద్ద మంగళవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. మిలిటరీ వాహనంలో వెళుతున్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడ్డ జవాన్లను సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం రాత్రి కాల్పుల విరమణ ఒప్పందానికి తిలోదకాలిస్తూ పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లోనూ ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డ సంగతి తెలిసిందే. జమ్మూ జిల్లా పరిధిలోని బీఎస్ఎఫ్ పోస్టులపై పాకిస్తాన్ రేంజర్లు ఎలాంటి కవ్వింపు చర్యలు లేనప్పటికీ కాల్పులకు దిగారని బీఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు.

  • Loading...

More Telugu News