: ‘చందన బ్రదర్స్’ చోరుడు దొరికాడట!


కూకట్ పల్లిలోని చందన బ్రదర్స్ లో ఈ నెల 7న భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. తమకు సవాల్ విసిరేలా జరిగిన ఈ చోరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారట. ఏ ఒక్క ఆధారం కూడా దొరకకుండా జాగ్రత్త పడిన సదరు చోర శిఖామణి, తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన పాత నేరస్తుడు శివశంకర్ ప్రసాద్ అలియాస్ లడ్డానేనని పోలీసులు గుర్తించారు. గుర్తించడమే తరువాయి, లడ్డాను అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. అసలు లడ్డానే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ఎలా గుర్తించారంటే, చోరీ జరిగిన చందన బ్రదర్స్ షోరూంను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు దొంగలవిగా భావిస్తున్న వేలి ముద్రలు లభించాయి. తమ కంప్యూటర్ డేటాబేస్ లోని పాత నేరస్తుల వేలి ముద్రలతో పోల్చిన పోలీసులు, అవి లడ్డావేనని తేల్చారు. నేరాలకు పాల్పడి, అరెస్టైన నేరస్తుల వేలిముద్రలతో పాటు పలు ఆధారాలను సేకరించే పోలీసు శాఖ, వాటిని తన కంప్యూటర్ డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తున్న సంగతి తెలిసిందేగా. సదరు డేటాబేస్ ప్రస్తుతం పోలీసులకు వరంగా మారింది. లడ్డాను పట్టించింది. చోరీలో భాగంగా లడ్డా తన సొదరుడితో కలిసి చందన బ్రదర్స్ ను దోచుకున్నాడని పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News