: చీమూనెత్తురూ ఉంటే మీ రాష్ట్రానికి వెళ్లి పాలించుకోండి: టీఎస్ మంత్రి మహేందర్ రెడ్డి
చంద్రబాబు, ఆయన మంత్రులకు చీమూనెత్తురూ ఉంటే తమ రాష్ట్రానికి వెళ్లి పాలించుకోవాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు... ఆయన మంత్రులు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసుకోవడం చేతకానివారు... తెలంగాణ గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు కేసీఆర్ పై విమర్శలు చేయడం మానుకోవాలని... మరోసారి అలా చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు .