: సత్తా చాటిన పుల్లెల గోపీచంద్ కుమార్తె


తన అకాడెమీలో మెరికల్లాంటి షట్లర్లను తయారు చేస్తున్న పుల్లెల గోపీచంద్ ప్రస్తుతం పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. ఎందుకంటే, ఆయన ముద్దుల తనయ గాయత్రి బ్యాడ్మింటన్ లో సత్తా చాటింది. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-13 బాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో గాయత్రి సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టైటిళ్లు నెగ్గింది. ఈ టోర్నీలో గాయత్రి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిథ్యం వహించింది. బాలుర విభాగంలో పవన్ కృష్ణ (ఖమ్మం) 'డబుల్ సాధించాడు'.

  • Loading...

More Telugu News