: చంద్రబాబును సన్మానించిన నాట్స్
రాష్ట్ర విభజన జరిగినా ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజల అభ్యున్నతికి పాల్పడుతున్నామని నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) ప్రతినిధులు తెలిపారు. రెండు రాష్ట్రాల అభివృద్ధిని తాము కాంక్షిస్తున్నామని చెప్పారు. ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును నాట్స్ ప్రతినిధులు నిన్న లేక్ వ్యూ అతిథిగృహంలో కలిశారు. 2015 జులై 2,3,4 తేదీల్లో లాస్ ఏంజెలెస్, కాలిఫోర్నియాలో జరగనున్న నాట్స్ ఉత్సవాలకు బాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు దేసు గంగాధర్, ఉపాధ్యక్షుడు రవి ఆచంట, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శ్యాం మద్దిలి, చక్రధర్ ఓలేటి, బుచ్చయ్య కొడ్రగట్టు తదితరులు పాల్గొన్నారు.