: గవర్నరు అధికారాలపై హోంమంత్రితో చర్చించా: ఎంపీ దత్తాత్రేయ
గవర్నరు అధికారాలపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చర్చించానని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. గవర్నరు పాలనను బలవంతంగా రుద్దుతున్నారనే భావన తెలంగాణ ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని రాజ్ నాథ్ సింగ్ ను కోరానని దత్తాత్రేయ అన్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత చర్చిస్తానని రాజ్ నాథ్ చెప్పారన్నారు.