: ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సూక్త యజ్ఞం


రాజమండ్రిలోని గౌతమీ ఘాట్ లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం శృంగార హారతి, భాగవత ప్రవచనం జరిగాయి. అనంతరం అఖండ హరినామ సంకీర్తన జరిగింది. ఈ సందర్భంగా మందిరంలోని రాధాకృష్ణులను పట్టు వస్త్రాలతో అలంకరించారు. సాయంత్రం ఇస్కాన్ అధ్యక్షులు సత్య గోపీనాథ్ ఆధ్వర్యంలో శ్రీ సూక్త యజ్ఞం ఘనంగా జరిగింది. మందిరంలో శ్రీ సత్యప్రసాద్ అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. అనంతరం స్వామివారి పల్లకీసేవ జరిగింది. ఇవాళ ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాధాగోపీనాథులను దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News