: సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టులో పిటిషన్


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శాస్త్రీయ పద్ధతిని పాటించడం లేదంటూ సునీతాలక్ష్మి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 19, 21 ప్రకారం ఈ సర్వే చట్టవిరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. సర్వేపై గెజిట్ విడుదల చేయలేదని పిటిషనర్ న్యాయస్థానానికి విన్నవించారు. ఇదిలా ఉండగా, సర్వే నిర్వహించనున్న నేపథ్యంలో ఆ రోజున తెలంగాణ ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News