: రైల్వే రిజర్వేషన్ కేంద్రాలను ప్రైవేటుపరం చేసిన రైల్వేశాఖ
రైల్వే రిజర్వేషన్ కేంద్రాలను రైల్వేశాఖ ప్రైవేటుపరం చేస్తోంది. ఈ మేరకు రిజర్వేషన్ కేంద్రాలను ప్రైవేటీకరిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యాత్రి టికెట్ సువిధ కేంద్రాల (వైటీఎస్ కె) పేరిట ప్రైవేటు రిజర్వేషన్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. పీపీపీ విధానంలో ఏర్పాటు చేసే ఈ కేంద్రాల ద్వారా రిజర్వ్, అన్ రిజర్వ్ టిక్కెట్లను జారీ చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైటీఎస్ కేంద్రాలు పనిచేస్తాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కేంద్రాలు ఉంటాయి. ఉదయం 11 గంటల తర్వాత తత్కాల్ టిక్కెట్లను జారీ చేస్తారు. వైటీఎస్ కే లో రిజర్వేషన్ చేయించుకున్న టిక్కెట్లకు సర్వీస్ ఛార్జీని వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. స్లీపర్ క్లాస్ టిక్కెట్ కు రూ.30, ఏసీ టిక్కెట్లకు రూ.50 సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు. అన్ రిజర్వ్ టిక్కెట్లను రూపాయి చొప్పున సర్వీస్ ఛార్జి వసూలు చేస్తారు.