: ఆ మూడు కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తాం: మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. విభజన చట్టం నిబంధనలను కేసీఆర్ ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. స్థానికతపై కేసీఆర్ నిర్ణయాలు ఆక్షేపణీయంగా ఉన్నాయని మంత్రి అన్నారు. కొన్ని ఆలయాల భూముల లీజుల రేట్లు పెంచి మళ్లీ ఇస్తామని పల్లె అన్నారు. విజయవాడలోని కంచి కామకోటి పీఠం వారి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్థలం లీజు పొడిగిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాలపై ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. మీనాక్షి పవర్ ప్రాజెక్టు నుంచి 125 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు.