: 'విస్తార'... టాటా వారి ఎయిర్ లైన్స్ పేరు ఇదే!


టాటా-సింగపూర్ ఎయిర్ లైన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నూతన ఎయిర్ లైన్స్ సంస్థకు 'విస్తార' అని నామకరణం చేశారు. సంస్కృత పదం 'విస్తార్' స్ఫూర్తిగా ఈ పేరును ఎంచుకున్నారు. ఈ పదానికి సంస్కృతంలో 'అపరిమితంగా వ్యాపించేది' అని అర్థం. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులను అనుసరించి ఈ అక్టోబర్ నుంచి విమాన సర్వీసులను ఆరంభించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై టాటా-సింగపూర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ చైర్మన్ ప్రసాద్ మీనన్ మాట్లాడుతూ, భారత విమానయాన చరిత్రలో ఇదో విప్లవాత్మకమైన రోజని పేర్కొన్నారు. 'విస్తార' భారత్ ప్రజల విమానయానాన్ని పునర్నిర్వచిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఈ జాయింట్ వెంచర్ లో సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 49 శాతం, టాటా గ్రూపుకు 51 శాతం వాటాలున్నాయి. తొలి ఏడాది దేశీయంగా 87 విమానాలు నడపాలని, తదుపరి ఆ సేవలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలని సంస్థ భావిస్తోంది.

  • Loading...

More Telugu News