: 'అతి' చేశాడంటూ రిపోర్టర్ ను బాదిన మారడోనా
అర్జెంటీనా సాకర్ దిగ్గజం డీగో మారడోనా ఎక్కడుంటే వివాదాలు అక్కడుంటాయి! తాజాగా ఓ పాత్రికేయుడికి తన పంచ్ పవర్ రుచి చూపాడీ ఆల్ టైం గ్రేట్. బ్యూనస్ ఎయిర్స్ లో జరిగిన ఓ బాలల చిత్ర ప్రదర్శనకు కుటుంబంతో హాజరయ్యాడు మారడోనా. 'పానమ్' అనే ఆ సినిమా ముగిసిన తర్వాత భార్య, కొడుకుతో నేషనల్ థియేటర్ నుంచి వెలుపలికి వస్తుండగా, మీడియా ప్రతినిధులు వారిని చుట్టుముట్టారు. కార్లో ఎక్కిన తర్వాత కూడా వారు వదలకపోవడంతో మారడోనాలో సహనం నశించింది. వెంటనే ఓ రిపోర్టరును నెట్టివేసి "ఏం చేస్తున్నావ్ రా, ఈడియట్? ఎందుకు నా భార్యను సతాయిస్తున్నావ్..?" అంటూ ఓ పంచ్ ఇచ్చుకున్నాడు. ఇదంతా అక్కడి టెలివిజన్ కెమెరాలకు చిక్కింది. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, తన కుమారుడితో బయటికి రావడం ఇదే ప్రథమమని, సినిమాకు తీసుకెళ్ళడాన్ని కొడుక్కి గిఫ్ట్ ఇచ్చినట్టుగా భావిస్తున్నానని తెలిపాడు.