: మోడీకి కూరగాయల 'రాఖీ' పంపారు!
రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓ వినూత్న రాఖీ అందుకున్నారు. ఆ రాఖీ టమోటాలు, తదితర కూరగాయలతో రూపొందించారు. దాన్ని పంపింది వడోదర కాంగ్రెస్ మహిళా కార్యకర్తలట. దేశంలో కూరగాయల ధరలు మండిపోతుండడంతో తమ నిరసనను వారు ఆ విధంగా వ్యక్తం చేశారు. దీనిపై వడోదర మున్సిపల్ కార్పొరేషన్ విపక్ష నేత పుష్పా బెన్ వాఘేలా మాట్లాడుతూ, కూరగాయల ధరలు పెరిగిన విషయాన్ని ప్రధానికి గుర్తు చేసేందుకే తాము టమోటాలతో తయారైన రాఖీని పంపామని తెలిపారు. ఇలాంటి రాఖీలనే చేతికి కట్టుకుని కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.