: మార్కెట్లోకి విడుదలైన హ్యుందాయ్ ‘ఎలైట్ ఐ20’ కారు
భారతీయ మార్కెట్లోకి హ్యుందాయ్ కంపెనీ ఎలైట్ ఐ20 కారు విడుదలైంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 4.89 లక్షలు. ఎరా, మాగ్నా, స్పోర్ట్న్, అస్టా అనే నాలుగు మోడళ్లలో ఇది లభ్యమవుతుంది. ఎరా పెట్రోల్ ఇంజన్ కారు రూ. 4.89 లక్షలు కాగా, డీజిల్ ఇంజన్ ధర రూ.6.10 లక్షలుగా నిర్ణయించారు. మాగ్నా పెట్రోల్ ఇంజన్ కారు రూ.5.42 లక్షలు కాగా, డీజిల్ ఇంజన్ ది రూ.6.62 లక్షలు. స్పోర్ట్స్ మోడల్ రూ.5.94 లక్షలు (పెట్రోల్), రూ.7.14 లక్షలు (డీజిల్). అస్టా రూ.6.47 లక్షలు (పెట్రోల్), రూ.7.64 లక్షలు (డీజిల్).