: అంధకారంలో మగ్గుతున్న 20 గ్రామాలు


ట్రాన్స్ ఫార్మర్లు పాడైపోవడంతో ఆ గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. అది కూడా ఒకటి, రెండు రోజుల నుంచి కాదు... నెల రోజులకు పైగానే. ఆగస్టు మొదటివారంలో ట్రాన్స్ ఫార్మర్లు పాడైపోవడంతో సుమారు 3 వేల మంది ప్రజలు కరెంటు లేకుండానే రోజులు వెళ్లదీస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్ జిల్లాలోని గ్రామాల పరిస్థితి ఇది. కరెంటు ఆఫీసుకెళ్లి కంఫ్లయింట్ ఇద్దామనుకుంటే... 50 కి.మీ. దూరంలో ఉంది. దాంతో, అధికారుల రాక కోసం వారు ఎదురుచూస్తున్నారు. సెల్ ఫోన్ చార్జింగ్ చేసుకోవడానికి ఆ గ్రామాల ప్రజలు పట్నం వెళ్లొస్తున్నారు... అది కూడా 25 కి.మీ. ప్రయాణించి. సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిపోతే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి కదా. అందుకే అంత దూరం వెళ్లి మరీ ఛార్జింగ్ చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News