: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ


ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆగస్ట్ 31లోగానే కౌన్సెలింగ్ పూర్తి చేయాలని సుప్రీం తుది తీర్పు ఇచ్చింది. కౌన్సెలింగ్ నిర్వహించడానికి 3 నెలల గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విభజన చట్టం ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో, ఎంసెట్ కౌన్సెలింగ్ పై ఏర్పడిన ఉత్కంఠకు తెరపడి... పూర్తి క్లారిటీ వచ్చింది. అయితే, స్థానికత అంశంపై వ్యాఖ్యానించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

  • Loading...

More Telugu News