: సచిన్ కు సెలవు మంజూరైంది!


భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడం తెలిసిందే. దీనిపై సచిన్ వివరణ ఇచ్చాడు కూడా. ఈ క్రమంలో ఆయన తాజా సమావేశాలకు హాజరు కాలేనని రాజ్యసభ చైర్మన్ కు అభ్యర్థన లేఖ పంపారు. కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా తనకు సెలవు మంజూరు చేయాలని లేఖలో కోరారు. సచిన్ విజ్ఞప్తిని పరిశీలించిన రాజ్యసభ చైర్మన్ సెలవుకు ఆమోదముద్ర వేశారు. పెద్దన్న అజిత్ కు బైపాస్ సర్జరీ కారణంగా తాను సమావేశాలకు హాజరుకాలేకపోయానని సచిన్ ఇంతకుముందు ఓ ప్రకటన చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News