: ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన పి.నారాయణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి పి.నారాయణ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక కానప్పటికీ నారాయణ ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆరు నెలల్లోగా ఆయన ఎమ్మెల్యేగా అయినా, ఎమ్మెల్సీగా అయినా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఇన్ ఛార్జి కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి సత్యనారాయణకు నామినేషన్ అందజేశారు. ఈ స్థానానికి ఈ నెల 21న ఎన్నిక జరగనుంది.