: తెలంగాణ రాష్ట్రంలో కోకకోలా భారీ పరిశ్రమ
ప్రముఖ శీతల పానీయ సంస్థ కోకకోలా తెలంగాణలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ విషయంపై మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో కోకకోలా ఉన్నతస్థాయి బృందం నేడు సమావేశం కానుంది. తమ ఉత్పత్తుల తయారీకి ఇండియాలో అత్యంత భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోకకోలా నిర్ణయించింది. ఈ క్రమంలో, కొత్త పరిశ్రమను నిర్మించడానికి దేశంలో తెలంగాణను అనువైన స్థలంగా ఎంచుకుంది. ఈ భారీ పరిశ్రమ ఏర్పాటుకు అమెరికాలోని కోకకోలా ప్రతినిధి బృందం రూపకల్పన చేసింది. సోమవారం సీఎం కేసీఆర్ తో సమావేశమైన తర్వాత ఈ పరిశ్రమ విషయమై మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే కోకకోలా హైదరాబాద్ కు సమీపంలోని పటాన్ చెరులో ఓ పరిశ్రమను నిర్వహిస్తోంది.