: మాజీ మంత్రి నివాసంలో మృతదేహం లభ్యం
మాజీ మంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ నేత కుమారి సెల్జా నివాసంలో ఈ ఉదయం తీవ్ర కలకలం రేగింది. ఆమె ఇంటి ఆవరణలో ఓ మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి సెల్జా ఇంటి పనిమనిషి భర్త అని తేల్చారు. అసహజ మరణంగా భావించి దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు. కుమారి సెల్జా యూపీఏ హయాంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రిగా పనిచేశారు.