: ఆ విమానం అదృశ్యం కాలేదు...కూలిపోయింది!


బుర్కినా ఫాసో నుంచి అల్జీరియా వెళ్తున్న ఏహెచ్ 5017 విమానం కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. బుర్కినా ఫాసో నుంచి టేకాఫ్ అయిన 50 నిమిషాలకే గ్రౌండ్ కంట్రోల్ రూంతో విమానానికి సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. వాతావరణం బాగా లేదని విమానం ప్రయాణిస్తున్న దిశ మార్చుకోవాలని కంట్రోల్ రూం అధికారులు పైలట్ కు సూచించారు. అనంతరం విమానంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఎమ్ డి 83 విమానం కూలిపోయింది. కూలిన విమానంలో 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. కాగా, విమానం ఎక్కడ కూలింది? అన్న విషయంపై పూర్తి స్పష్టత రాలేదు.

  • Loading...

More Telugu News