: హక్కులను హరించడం 'ఫాసిజం' కాకపోతే మరేమిటి: కేటీఆర్
ప్రధాని నరేంద్ర మోడీ ఫాసిస్టులా వ్యవహరిస్తున్నారని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం... కొత్త వివాదానికి తెరలేపింది. దీనిపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలను కేసీఆర్ వెనక్కు తీసుకోవాలని నిన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా టీఎస్ మంత్రి కేటీఆర్ స్పందించారు. హక్కుల కోసం పోరాడటం ప్రజాస్వామ్యం అవుతుందని... హక్కులను హరించి వేయడం ఫాసిజం అవుతుందని ట్విట్టర్లో తెలిపారు. యూపీఏ చేసిన తప్పులను కొనసాగించాలనుకుంటే... ఎన్డీయే ప్రభుత్వం యూపీఏ-3 అవుతుందని విమర్శించారు. తెలంగాణలో యూపీఏను ప్రజలు తిరస్కరించిన సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు.