: షార్జా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయుల మృతి


షార్జా సిటీలో దారుణ ఘటన సంభవించింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు భారతీయులు మరణించగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులంతా కేరళకు చెందిన వారు. పోలీసుల వివరాల ప్రకారం, తమ స్నేహితుడిని విమానాశ్రయం నుంచి తీసుకురావడానికి ముగ్గురు వ్యక్తులు కారులో బయల్దేరారు. స్నేహితుడిని తీసుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News