: లాభాలు ఘనం... రక్షణ కల్పించడంలో విఫలం
దక్షిణ మధ్య రైల్వే సామాన్యులకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమవుతోంది. ద.మ.రైల్వే దేశంలోని అన్ని జోన్ లలో లాభాలను ఆర్జించడంలో ముందున్నది. 7500 కి.మీ పొడవైన రైలుమార్గం ఈ జోన్ పరిధిలో ఉంది. ద.మ. రైల్వే పరిధిలో మొత్తం 3500కు పైగా రైల్వే క్రాసింగ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో సగం రైల్వే క్రాసింగ్ ల వద్ద మాత్రమే కాపలా గేట్లు ఉన్నాయి. కాపలా సౌకర్యం లేని చోట గేట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా సరైన నిధులు కేటాయించకపోవడంతో ఆ పనిని పూర్తిచేయలేకపోయారు. చాలావరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లెవెల్ క్రాసింగులను ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో క్రాసింగ్ చేయాలంటే దినదిన గండంగా మారింది.