: కొత్త పంథాలో సకలజన సర్వే... బెడ్ రూమ్, కిచెన్ లు కూడా పరిశీలించనున్న అధికారులు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించనున్న సకలజన సర్వే సరికొత్త పంథాలో సాగనుంది. అన్ని సర్వేలలో మాములుగా ప్రజలు చెప్పేదే ఎన్యూమరేటర్లు (సర్వే చేసే అధికారులు) రాసుకుంటారని... కానీ ఈ సర్వే అలా ఉండకూడదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జనాభా లెక్కల్లా పొడిపొడిగా కాకుండా... ఇంట్లో ఉన్న పరిస్థితులను, స్థితిగతులను పరిశీలించి అప్లయిడ్ మైండ్ తో సేకరించాలని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు, కేవలం ప్రజలు చెప్పిందే కాకుండా... చూసింది రాయాలని ఎన్యూమరేటర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం, సకలజన సర్వేలో ఎన్యూమరేటర్లు కేవలం ప్రజలు చెప్పింది విని రాసుకునే శ్రోతలుగానే వ్యవహరించరు. ప్రజలు చెప్పింది వినడమే కాకుండా... వారు చెప్పింది ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ఇళ్ల లోపలకు తొంగిచూడనున్నారు. ప్రతీ ఇంట్లో ఎన్ని పొయ్యిలు ఉన్నాయో గమనిస్తారు... ఎన్ని పొయ్యిలు ఉంటే ఇంట్లో అన్ని కుటుంబాలు ఉన్నట్టుగా పరిగణిస్తారు. అలాగే ఇంట్లోని మిగతా గదులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అలాగే ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, గ్యాస్ కనెక్షన్... ధ్రువీకరణ పత్రాలు, భూమిపట్టా పుస్తకాలు తదితర పత్రాలన్నీ పరిశీలించి పక్కా సమాచారాన్ని ఖరారు చేసుకున్న తర్వాతే వివరాలు నమోదు చేసుకుంటారు. సరిగ్గా పరిశీలించకుండా... తప్పుడు సమాచారం రాసుకువచ్చిన ఎన్యూమరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News