: రేపు కడప జిల్లాలో రాజధాని కమిటీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రేపు కడప జిల్లాలో పర్యటించనుంది. కమిటీ రేపు ఉదయం 10.30కి జిల్లా అధికారులతో భేటీ అవుతుంది. పర్యటన సందర్భంగా రాజధాని ఏర్పాటుకు సంబంధించి వినతులు, అభిప్రాయాలు స్వీకరిస్తారు. కాగా, కమిటీ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.