: బోస్ కు భారతరత్న వద్దు... అదృశ్యంపై మిస్టరీ ఛేదించండంటున్న బంధువులు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు భారతరత్న అక్కర్లేదని, ఆయన అదృశ్యంపై మిస్టరీని ఛేదిస్తే చాలని ఆయన బంధువులు అభిప్రాయపడుతున్నారు. మోడీ సర్కారు బోస్ కు భారతరత్న ఇవ్వనుందన్న వార్తలపై వారు స్పందించారు. ఆయనకు భారతరత్న ఇవ్వడంపై తాము మొదటినుంచి వ్యతిరేకిస్తున్నామని, బంధువుల్లో అత్యధికులు ఇదే అభిప్రాయంతో ఉన్నారని బోస్ మునిమనుమడు చంద్రకుమార్ బోస్ చెప్పారు. ఆయన అదృశ్యంపై నెలకొన్న మిస్టరీని ఛేదించాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని చంద్రకుమార్ తెలిపారు.