: తమిళనాడు వ్యక్తికి 'ఎబొలా' పరీక్షలు


గినియా నుంచి భారత్ కు తిరిగివచ్చిన తమిళనాడు వ్యక్తికి 'ఎబొలా వైరస్' పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆఫ్రికాలో ఎబొలా వైరస్ ప్రబలిన నేపథ్యంలో అతనిని వైద్య పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం అతడు చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడు. థేణి జిల్లాకు చెందిన ఈ వ్యక్తి గినియా నుంచి శనివారం రాత్రి చెన్నై చేరుకోగా, అతడిని వెంటనే రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతనికి ఎబొలా వైరస్ సోకిందో, లేదో అన్న అంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ రఘునందన్ తెలిపారు.

  • Loading...

More Telugu News