: ఏపీ అభివృద్ధి కోసం రూ.కోటి విరాళమిచ్చిన సిఫి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం సిఫి బ్రాడ్ బ్యాండ్ సంస్థ రూ.కోటి విరాళం అందించింది. ఈ మేరకు సంస్థ సీఈఓ అనంత కోటిరాజు వేగేశ్న తన సోదరుడితో కలిసి సీఎం చంద్రబాబును నేడు కలిశారు. ఈ సందర్భంగా కోటి రూపాయల చెక్ ను బాబుకు అందించారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ముందుకొచ్చిన వారిని చంద్రబాబు అభినందించారు.