: కేసీఆర్ పై దాడుల తీవ్రత పెంచిన టీడీపీ నేతలు
గవర్నర్ కు ప్రత్యేక అధికారాలపై అడ్డుచెబుతున్నాడంటూ టీడీపీ నేతలు తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖరరావుపై చేస్తున్న విమర్శల దాడి తీవ్రమైంది. ఇప్పటికే ఆంధ్రా మంత్రులు యనమల, కామినేని... తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి తదితరులు కేసీఆర్ వైఖరిని దుయ్యబట్టారు. తాజాగా వీరి జాబితాలో చేరారు ఆంధ్రా మంత్రి పల్లె రఘునాథరెడ్డి. కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సైతం తుంగలో తొక్కడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అసలు విజయనగరంలో పుట్టిన కేసీఆర్ ఏ విధంగా తెలంగాణలో స్థానికుడో చెప్పాలని పల్లె డిమాండ్ చేశారు.