: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకో: కేసీఆర్ పై యనమల ఫైర్
గవర్నర్ కు ప్రత్యేక అధికారాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై ఆంధ్రా ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. గవర్నర్ కు అధికారాలపై ఆయన వ్యాఖ్యలు సరికావని అన్నారు. విభజన బిల్లు రూపొందించేటప్పుడు లేని అభ్యంతరం కేసీఆర్ కు ఇప్పుడెందుకని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని యనమల పేర్కొన్నారు.