: చంద్రబాబుపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత దత్తాత్రేయకు మంత్రి పదవి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. బాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, తెలంగాణపై విషం చల్లేందుకే అధిక సమయం వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారని, పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బాబు కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లకు మారుపేరని ఎత్తిపొడిచారు. ఈ మేరకు హరీశ్... బాబుకు పది ప్రశ్నలతో కూడిన లేఖాస్త్రాన్ని సంధించారు.