: జగన్ ప్రతిపక్ష నేతగా పనికిరాడు: మంత్రి బొజ్జల
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పై మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ప్రతిపక్ష నేతగా పనికిరాడని పేర్కొన్నారు. ఆయనకు బొత్తిగా రాజకీయ అనుభవం, పరిజ్ఞానం లేవని, అలాంటి వ్యక్తి రుణమాఫీపై వ్యాఖ్యానించడం తగదన్నారు. ప్రస్తుతం జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడం దురదృష్టకరమని బొజ్జల పేర్కొన్నారు. తిరుపతిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.