: కేంద్రానికి రెండు రాష్ట్రాలు ఒక్కటే: వెంకయ్య నాయుడు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ, కేంద్రానికి ఉభయ రాష్ట్రాలు ఒక్కటేనని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని వెంకయ్య పేర్కొన్నారు. రాష్ట్రాలు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని ఆయన హితవు పలికారు.