: ముగ్గురు విద్యార్థినుల అనుమానాస్పద మృతి
గుంటూరు జిల్లా సీతానగరం వద్ద ముగ్గురు విద్యార్థినులు జలసమాధి అయ్యారు. విజయవాడ ఆటోనగర్ కు చెందిన వీరు ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నారు. కాలేజీకని వెళ్ళిన ఆ ముగ్గురు స్నేహితురాళ్ళు కృష్ణానదిలో శవాలై తేలారు. దీంతో, వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వారిని పూజిత, పల్లవి, నాగలక్ష్మిగా గుర్తించారు. కాగా, వీరి మరణంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒక్కసారే ముగ్గురూ చనిపోవడంపై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, నీటిలో ఈదేందుకు వారు యత్నించి ఉంటారని, ఇసుక కోసం తీసిన గుంతల్లో లోతును అంచనా వేయలేక మునిగిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.