: ఆలయంలో ఎలుగుబంటి హల్ చల్


కరీంనగర్ జిల్లా గంగిపల్లి గ్రామంలో ఓ ఎలుగుబంటి అందరినీ హడలెత్తించింది. గ్రామంలోని ఓ శివాలయంలో ప్రవేశించిన ఈ క్రూరమృగాన్ని బంధించేందుకు గ్రామస్తులు, అటవీ శాఖాధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఉదయం ఆలయంలో ఎలుగుబంటిని చూసిన పూజారి వెంటనే తలుపులు మూసివేసి స్థానికులకు సమాచారమందించాడు. దీంతో, తీవ్ర భయాందోళనలకు గురైన గ్రామస్తులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు విషయం తెలియజేశారు. వారు వచ్చి బంధించే క్రమంలో అది ఆలయ ప్రహరీ గోడ దూకి సమీప పొలాల్లోకి పరుగుపెట్టింది. చివరికి ఎంతో శ్రమించి ఆ జంతువును బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News