: కామన్ వెల్త్ గేమ్స్ అఫీషియల్ సాంగ్ వీడియోలో భారత పతాకానికి అవమానం


గ్లాస్గో నగరంలో 'కామన్ వెల్త్ గేమ్స్ - 2014' అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే, కామన్ వెల్త్ గేమ్స్ నిర్వాహకులు చేసిన పొరపాటు ఇప్పుడు భారతీయుల గుండెలు మండేలా చేస్తున్నాయి. గేమ్స్ కోసం విడుదల చేసిన అఫీషియల్ సాంగ్ వీడియోలో అన్ని కామన్ వెల్త్ దేశాల జెండాలను చిన్నారులు పట్టుకున్నట్టు షూట్ చేశారు. అయితే, మన జాతీయ పతాకాన్ని మాత్రం తలకిందులుగా పట్టుకుని చూపారు. ఆకుపచ్చ రంగు పైకి, కాషాయం రంగు కిందకు వచ్చేలా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కోట్లాది భారతీయుల హృదయాలను గాయపరుస్తోంది. దీనిపై కామన్ వెల్త్ క్రీడల నిర్వాహకులు ఏం చేస్తారో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News