: భారత్ లోనూ తయారయ్యారు తాలిబాన్లు!


మనదేశంలోనూ తాలిబాన్ పోకడలు వెల్లడవుతున్నాయనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. ఉత్తరప్రదేశ్ లోని మధుర నగరంలో ఉన్న ఓ మ్యూజియంలోని విక్టోరియా మహారాణి విగ్రహాలను కొందరు దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఛాందసవాద 'స్వదేశీ సంస్థ' సభ్యులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు సుత్తి, గునపాలతో ఈ దాడికి పాల్పడినట్టు మ్యూజియం వర్గాలు తెలిపాయి. వారిలో ఇద్దరిని మ్యూజియం భద్రత సిబ్బంది పట్టుకోగా, మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడ్డ వారిని అర్వింద్ త్యాగి, రింకుగా గుర్తించారు. ఈ ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. బ్రిటీష్ పాలనకు గుర్తుగా ఉన్నాయనే తాము విక్టోరియా మహారాణి విగ్రహాలను ధ్వంసం చేశామని వారు పోలీసు విచారణలో తెలిపారు. కాగా, 200 ఏళ్ళనాటి ఈ విగ్రహాలను అష్ట లోహాలతో తయారుచేశారు.

  • Loading...

More Telugu News