: ఫాసిస్ట్ పదానికి కేసీఆర్ సరికొత్త అర్థం చెప్పారు: వెంకయ్య
రాష్ట్ర విభజన చట్టానికి టీఆర్ఎస్ సహా పార్లమెంట్ లో అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆ చట్టం ప్రకారమే గవర్నర్ కు హైదరాబాద్ లో శాంతిభద్రతల అధికారాలు సంక్రమించాయన్నారు. బిల్లులో ఉన్న అంశాల్నే తాము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. నరేంద్రమోడీని కేసీఆర్ ఫాసిస్ట్ అనడాన్ని ఆయన తప్పుబట్టారు. విభజన బిల్లును పార్లమెంట్ ఆమోదించినప్పుడు సంబరాలు చేసుకున్న కేసీఆర్, ఇప్పుడీ విధంగా వ్యాఖ్యానించడం తగదన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఫాసిస్టు అనే పదాన్ని వాడతారని... కానీ పార్లమెంట్ లో ఆమోదం పొందిన బిల్లును అమలు చేస్తుంటే... మోడీ ఫాసిస్టు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తన వ్యాఖ్యాలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.