: ఇరాన్ లో కూలిపోయిన విమానం... 40 మంది మృతి
ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని మెహరాబాద్ విమానాశ్రయంలో ఓ విమానం కూలిపోయింది. ఈ దారుణ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 40 మంది మృత్యువాత పడ్డారు. విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఈ దారుణం సంభవించింది. ఇంజిన్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.