: ఆర్బీఐ లేఖల వివాదం...దమ్ముంటే నిరూపించండి: వాసిరెడ్డి పద్మ
రిజర్వ్ బ్యాంక్ కు దొంగ నివేదికలు పంపినట్లు మంత్రి దేవినేని ఉమ చేసిన ఆరోపణలను వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఖండించారు. ఊరికే ఆరోపణలు చేయడం కాదని... దమ్ము, ధైర్యం ఉంటే ఆర్బీఐకు తాము నివేదికలు అందజేసినట్లు నిరూపించాలని ఆమె సవాల్ విసిరారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక... రైతులను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి దిగజారుడు ప్రచారానికి టీడీపీ పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.