: ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న శివరామకృష్ణన్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తోంది. కమిటీ సభ్యులు ముందుగా కొత్తపట్నం మండలం కొప్పోలు చేరుకున్నారు. అక్కడ వాన్ పిక్ కోసం సేకరించిన విమానాశ్రయం భూములను పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గంతో గల అనుసంధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బకింగ్ హామ్ కెనాల్ ను పరిశీలించేందుకు వెళ్లారు.